స్టార్ డైరెక్టర్ అని పూరిని ఆయన భార్య పెళ్లి చేసుకోలేదు. చేతిలో చిల్లి గవ్వ లేని టైమ్ లో.. ఆయన వెంట వచ్చేసింది అన్నారు బండ్ల. గుళ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత పూరీ స్టా్ర డైరెక్టర్ అయ్యారు. అది ఆయన భార్య గొప్పతనం అంటూ బడ్ల స్పీచ్ ఇరగదీశాడు. అంతే కాదు ఇండస్ట్రీ అంతా ఉలిక్కి పడేలా.. ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయి.. పోతుంటాయి.. అంటూ ఇన్ డైరెక్ట్ గా పూరీకి హితవు పలికే ప్రయత్నం చేశాడు బండ్ల.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నారు. చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో పూరి నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.