యాంకర్ గా పలు టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో పని చేసింది అరియానా. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ, అందులో అరియానా తొడలపై వర్మ చేసిన వెకిలి కామెంట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. వర్మ చేసిన తొడల కామెంట్లతో ఆమెకు సూపర్ క్రేజ్ వచ్చింది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ గడపతొక్కి పాపులారిటీ రెట్టింపు చేసుకుంది అరియానా.
బిగ్ బాస్ సీజన్-4 ఫైనలిస్ట్‌గా వెళ్లి ఫాలోయింగ్ పెంచుకుంది అరియానా. అప్పటినుంచి పలు ఇంటర్వ్యూల్లో భాగమవుతూ బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. వీలు కుదిరినప్పుడల్లా తన బెస్ట్ ఫ్రెండ్, బిగ్ బాస్ కంటిస్టంట్ అషు రెడ్డితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అయ్యాయి.