Anasuya Bharadwaj: రీసెంట్ గా కొంతమంది తారల మార్ఫింగ్ ఫొటోస్ ఇష్యూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై మరోసారి ఘాటుగా రియాక్ట్ అయింది యాంకర్ అనసూయ.
జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు సూపర్ పాపులారిటీ ఉంది. చిన్నితెరకు గ్లామర్ అద్దిన అతి కొంతమంది సెలబ్రిటీల్లో అనసూయ ఒకరు. అందానికి అందం, మాటకు మాట అన్నట్లుగా బుల్లితెరపై జబర్దస్త్ జర్నీ చేస్తోంది అనసూయ.
2/ 9
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను అభిమానుల ముందర పెట్టడం అనసూయ హ్యబీ. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించిన అనసూయ.. పలు ఇట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
3/ 9
రీసెంట్ గా కొంతమంది తారల మార్ఫింగ్ ఫొటోస్ ఇష్యూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినీ తారలు, బుల్లితెర సెలెబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా వాడడమే గాక, ఇష్టమొచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నాడని అనసూయ చేసిన ఫిర్యాదుతో ఆ కేసు చేధించారు సైబర్ క్రైం పోలీసులు.
4/ 9
సోషల్ మీడియాలో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నది ఎవరనే కోణంలో ఆరాదీసి.. చివరకు ఏపీకి చెందిన ఓ వ్యక్తిని తెలంగాణ సైబర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా అనసూయ కంప్లైంట్ పై సరైన చర్చ తీసుకున్నారు. దీంతో నెట్టింట తుంటరివాళ్ల వెన్నులో కాస్త భయం పుట్టిందనే చెప్పుకోవాలి.
5/ 9
అయితే తాజా చిట్ చాట్ లో ఇదే ఇష్యూపై అనసూయను ఓ ప్రశ్న అడిగాడు నెటిజన్. దీనిపై రియాక్ట్ అయిన అనసూయ.. కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. సోషల్ మీడియాలో తప్పుడు పనులు చేస్తున్న ఏ ఒక్కరినీ వదిలేదే లేదన్నట్లుగా తన రియాక్షన్ ఇచ్చింది అనసూయ.
6/ 9
అరెస్టులు మొదలయ్యాయి కదండీ! అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్టులు చేస్తున్నారు. కొంత నెమ్మదిగా కొనసాగుతున్నా, ప్రొగ్రెస్ అయితే ఉంది. సైబర్ క్రైమ్ పోలీసుల పని తీరు పట్ల చాలా సంతోషంగా ఉంది అని పేర్కొంది యాంకర్ అనసూయ.
7/ 9
నా ఉద్దేశం ఒకటే.. ట్రోలింగ్ అంటే కించపరచడం కాదు. అగౌరవ పరచడం తప్పు. అది చట్టరీత్యా నేరం అనేది గట్టిగా చూపించాలి అనుకుంటున్నా. చాలా ఓపికతో నచ్చచెప్పాలని చూశా కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు యాక్షన్ మొదలయ్యింది అని అనసూయ చెప్పడం గమనార్హం.
8/ 9
బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2తో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది.
9/ 9
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రంగమార్తాండ, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబా సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.