Anasuya: 22 ఏళ్లుగా అతనంటే ఇష్టం.. ఆయనే నా క్రష్ అంటూ సీక్రెట్స్ చెప్పిన అనసూయ
Anasuya: 22 ఏళ్లుగా అతనంటే ఇష్టం.. ఆయనే నా క్రష్ అంటూ సీక్రెట్స్ చెప్పిన అనసూయ
Anchor Anasuya First Crush: తాజాగా నాతో చాట్ చేయండి అంటూ ఆన్ లైన్ లోకి వచ్చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు క్యూ కట్టారు. అనసూయపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అందులో ఓ నెటిజన్ ఆమె ఫస్ట్ క్రష్‌పై ప్రశ్న వేశాడు. దీంతో అనసూయ ఓపెన్ అవుతూ నేరుగా సమాధానం చెప్పింది.
సెలబ్రిటీల తాలూకు వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా వారి వారి ప్రేమ ముచ్చట్లు, పెళ్లి సంగతులపై ఓ కన్నేసి ఉంచుతారు. అలా అనసూయ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఓ నెటిజన్.
2/ 11
సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించడం, ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోకి వస్తుండటం అనసూయ హ్యబీ. తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ మాయ చేయడమే కాదు.. అప్పడప్పుడు అందరితో చిట్ చాట్ చేస్తూ నెట్టింట హంగామా చేస్తుంటుంది అనసూయ.
3/ 11
ఈ నేపథ్యంలోనే తాజాగా నాతో చాట్ చేయండి అంటూ ఆన్ లైన్ లోకి వచ్చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు క్యూ కట్టారు. అనసూయపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అందులో ఓ నెటిజన్ ఆమె ఫస్ట్ క్రష్‌పై ప్రశ్న వేశాడు. దీంతో అనసూయ ఓపెన్ అవుతూ నేరుగా సమాధానం చెప్పింది.
4/ 11
మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా? ఉంటే అది ఎవరో చెప్పండి అని నెటిజన్ అడగడంతో.. ''అవును గత 22 ఏళ్లుగా భరద్వాజ్ మీదే నా క్రష్. అదే కదా కష్టం, సుఖం రెండు'' అని సమాధానం చెప్పింది అనసూయ. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా అభిమానులతో పంచుకుంది.
5/ 11
అనసూయ ప్రస్తుత వయస్సు 37 ఏళ్లు. మరి 22 ఏళ్లుగా భర్త పై క్రష్ ఏంటి..? అసలు వీరికి పెళ్లి ఎప్పుడు జరిగింది? లెక్కలు తేడా వస్తున్నాయేంటి అనే సందేహాలు జనాల్లో నెలకొన్నాయి. కాకపోతే అనసూయ చెప్పింది నిజమే. స్కూల్ డేస్ లోనే సుశాంక్ భరద్వాజ్ తో లవ్ లో పడింది అనసూయ.
6/ 11
అనసూయ ప్రస్తుత వయస్సు 37 ఏళ్లు. మరి 22 ఏళ్లుగా భర్త పై క్రష్ ఏంటి..? అసలు వీరికి పెళ్లి ఎప్పుడు జరిగింది? లెక్కలు తేడా వస్తున్నాయేంటి అనే సందేహాలు జనాల్లో నెలకొన్నాయి. కాకపోతే అనసూయ చెప్పింది నిజమే. స్కూల్ డేస్ లోనే సుశాంక్ భరద్వాజ్ తో లవ్ లో పడింది అనసూయ.
7/ 11
NCC బ్యాచ్ లో మొదలైన అనసూయ- సుశాంక్ భరద్వాజ్ లవ్ ట్రాక్ చాలా ఏళ్లకు పెళ్లి పీటలెక్కింది. అదికూడా పెద్దల అంగీకారంతో. చాలా ఏళ్ల వరకు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంది ఈ జోడీ. అందుకే తనకు 22 ఏళ్ళుగా ఆయనే క్రష్ అని చెప్పింది అనసూయ.
8/ 11
యాంకర్ అనే పదానికి కొత్త అందం తీసుకొస్తూ తన గ్లామర్ ట్రీట్ తో చిన్నితెర ప్రేక్షకుల నాడి పట్టేసింది అనసూయ. జబర్దస్త్ బ్యూటీగా ఆమెకు మస్త్ పాపులారిటీ దక్కింది. బుల్లితెరపై ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
9/ 11
అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ (NTR Naaga) సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ (Anasuya Bharadwaj). ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది.
10/ 11
ప్రస్తుతం టీవీ రంగానికి గుడ్ బై చెప్పి వెండితెరపై బిజీ అవుతోంది అనసూయ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తూ రావడం చూస్తున్నాం. రీసెంట్ గా జబర్దస్త్ కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటోంది.
11/ 11
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప 2 సహా పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది అనసూయ.