మరోవైపు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ వస్తోంది అనసూయ. ఇటీవలే దర్జాతో పాటు రంగమార్తాండ సినిమాలు కంప్లీట్ చేసింది అనసూయ. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బిజీ షెడ్యూల్స్ నడుమ అనసూయకు కాసుల పంట పండుతోంది. తగ్గేదే లే అన్నట్లుగా అనసూయ దూసుకుపోతోంది.