ANCHOR ANASUYA BIG DECISION SHE LEFT FROM JABARDASTH SLB
Anasuya: షాకింగ్.. జబర్దస్త్ నుంచి అనసూయ అవుట్! జీవితంలో బిగ్ డిసీజన్ అంటూ ఎమోషనల్
Anchor Anasuya Jabardasth: ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి ఫేమస్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఈ లిస్టులో సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఉండగా.. ఇప్పుడు అనసూయ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పోస్ట్ చేసిన మెసేజ్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
జబర్దస్త్ బ్యూటీగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనసూయ భరద్వాజ్. ఫిమేల్ యాంకర్లలో కెల్లా తాను డిఫరెంట్ అన్నట్లుగా ఏళ్ల తరబడి చిన్నితెరపై తన మార్క్ చూపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ మెసేజ్ పలు అనుమానాలకు తావిస్తోంది.
2/ 8
బుల్లితెరపై గ్లామర్ టచ్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయింది అనసూయ. జబర్దస్త్ వేదికగా అందరినీ అట్రాక్ట్ చేస్తూ కామెడీ జర్నీలో భాగమైంది. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ యాంకర్‌గా సత్తా చాటుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆ జర్నీకి ఫుల్స్టాప్ పెట్టబోతుందని తెలుస్తోంది. అందుకు కారణం తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ మెసేజ్.
3/ 8
జబర్దస్త్ వేదికగా చిన్నితెరపై కామెడీ పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో అనసూయ ముందువరుసలో ఉంటూ వస్తోంది. కాగా ఇప్పటికే జబర్దస్త్ జడ్జెస్ నాగబాబు, రోజా తమ తమ సీట్లను వదిలేయగా ఇప్పుడు అనసూయ కూడా అదే బాట పెట్టిందనే సమాచారాలు వైరల్ అవుతున్నాయి.
4/ 8
ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి ఫేమస్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఈ లిస్టులో సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఉండగా.. ఇప్పుడు అనసూయ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పోస్ట్ చేసిన మెసేజ్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
5/ 8
''నా కెరీర్ పరంగా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నా. చాలా మెమొరీస్ నావెంట తీసుకెళ్తున్నా. అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉండగా.. కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎప్పటిలాగే మీ ఆదరణ నాపై ఉంటుందని భావిస్తున్నా'' అంటూ అనసూయ తన ఇన్స్‌స్టా లో పోస్ట్ పెట్టింది.
6/ 8
అంతేకాదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నప్పటికీ సడన్ గా ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజే అప్లై చేశా అని అనసూయ పేర్కొంది. ఇది చూసి జబర్దస్త్ నుంచి అనసూయ విడిచి వెళుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ వీడుతుంది కాబట్టే ఇలా మెసేజ్ పోస్ట్ చేసిందనే టాక్ స్ప్రెడ్ అవుతోంది.
7/ 8
ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణిగా మెప్పించిన అనసూయ.. ప్రస్తుతం పలు సినిమాల్లో భాగమవుతోంది. నటిగా కూడా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలతో పాటు ఫిమేల్ లీడ్ సినిమాల్లో కూడా దర్శకనిర్మాతలకు బెటర్ చాయిస్ అవుతోంది అనసూయ.
8/ 8
కృష్ణవంశీ దర్శకత్వంలో అనసూయ నటించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే దర్జా అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఈ మూవీ అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.