అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. (Photo Credit : Instagram)
ఇక పుష్ప ఫస్ట్ పార్ట్‌లో అనసూయ రోల్ తక్కువగానే ఉన్నా సెకండ్ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్‌తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. సెకండ్ పార్ట్ లో అనసూయ, సునీల్ మరింత బలవంతులుగా మారనున్నారని టాక్ విన్సిస్తోంది. (Photo Credit : Instagram)
ఈ సినిమాతో పాటు అనసూయకు మరో సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె 'ఎయిర్ హోస్టెస్'గా కనిపించనుందని అంటున్నారు. గతంలో 'పేపర్ బాయ్' సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయను లీడ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందట. (Photo Credit : Instagram)
ఈ సినిమాలతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా అనసూయ కనిపించనుంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. (Photo Credit : Instagram)