అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోను నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'రంగమార్తాండ'లో నటించింది. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న రిలీజ్ అయ్యింది. అది అలా ఉంటే రంగమార్తాండ ప్రమోషన్స్‌లో పాల్గోన్న అనసూయ కాస్తా భావోద్వేగం చెందారు. సినిమాను చూసిన అనసూయ కృష్ణవంశీకి థ్యాంక్స్ చెబుతూ.. ఒక్కసారిగా ఏడ్చేసింది. స్టేజ్ పై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. Photo : Instagram
రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇక తాను మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు. నా జీవితానికి రంగమార్తాండ మూవీ చాలంటూ భావోద్వేగం చెందింది. నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఈ రంగమార్తాండ. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను.. అందుకే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Photo : Twitter
ఇక మరోవైపు అనసూయ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడయాలో హల్ చల్ చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యిన అనసూయ తెలుగు యాంకర్స్‌లో సుమ తర్వాత రెండవ స్థానంలో ఉంది. అంతేకాదు ఈ భామ ఒక్కో షోకు దాదాపుగా రూ. 2 లక్షల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Instagram
దీనికి తోడు ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఓ మలయాళీ చిత్రంలో కనిపించిన అనసూయకు మరో మలయాళీ చిత్రంలో అవకాశం వచ్చింది. వీటికితోడు ఓ రెండు తమిళ సినిమాల్లోను నటిస్తోందట అనసూయ. మరోవైపు తెలుగులో పుష్ప 2లో అనసూయ పాత్రను పెంచనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ భామ కృష్ణవంశీ రంగ మార్తండలో నటిస్తోంది. Photo : Instagram
ఇక అనసూయ ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Instagram.
ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.. Photo : Instagram