Anchor Anasuya: సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు.. ఇది అనసూయ కొత్త కోణం గురూ!
Anchor Anasuya: సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు.. ఇది అనసూయ కొత్త కోణం గురూ!
Anasuya Bharadwaj: జబర్దస్త్ కార్యక్రమానికి వీడ్కోలు పలికిన అనసూయ స్టార్ మా చెంతకు చేరింది. స్టార్ మా లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ జోష్ కొనసాగిస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలిసి సూపర్ సింగర్ షోలో సందడి చేస్తోంది.
అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై అనసూయ హవా నడుస్తోంది. బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించిన అనసూయ.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. కెమెరా ముందు అనసూయ చూపిస్తున్న టాలెంట్ ప్రేక్షకుల మనసు దోచేస్తోంది.
2/ 8
గత ఏడేళ్లుగా జబర్దస్త్ తెరపై తెగ హంగామా చేసిన అనసూయ.. రీసెంట్ గానే ఈ షోకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాను జబర్దస్త్ వీడుతున్నట్లు చెప్పి సడెన్ షాకిచ్చింది ఈ బుల్లితెర బ్యూటీ. కొన్నేళ్లుగా జబర్దస్త్ వేదికపై ఎంటర్టైన్ చేసిన అనసూయ అనూహ్యంగా తప్పుకోవడం హాట్ టాపిక్ అయింది.
3/ 8
జబర్దస్త్ కార్యక్రమానికి వీడ్కోలు పలికిన అనసూయ స్టార్ మా చెంతకు చేరింది. స్టార్ మా లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ జోష్ కొనసాగిస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలిసి సూపర్ సింగర్ షోలో సందడి చేస్తోంది. ఈ షో హోస్ట్ చేయడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది.
4/ 8
ఇది సింగింగ్ షో కావడంతో అదే ట్రాక్ లో వెళ్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే ఆలోచనలు చేస్తోంది అనసూయ. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ లో తన లోని సింగింగ్ టాలెంట్ బయటపెట్టింది. ఆమె పాట విని చిన్నితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
5/ 8
మనోతో కలిసి తనలోని గాత్ర ప్రతిభను అందరి ముందు పెట్టింది అనసూయ. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అంటూ రొమాంటిక్ సాంగ్ వేసుకుంది. మనో, అనసూయ కలిసి పాడిన ఈ పాట షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
6/ 8
అనసూయ పాటను చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను పదేపదే రిపీట్ చేసుకుంటూ చూస్తున్నారు. అలా అనసూయ పాట ఈ షోకి అడ్వాంటేజ్ అయింది. అనసూయ ఆ పాట పాడిన విధానం చూసి జబర్దస్త్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా! సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
7/ 8
జబర్దస్త్ వీడి స్టార్ మా ఛానెల్ కి వచ్చినందుకు గాకు అనసూయకు భారీ సొమ్ము ముట్టజెబుతున్నారని తెలుస్తోంది. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని, అందుకే ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిందని అంటున్నారు.
8/ 8
మరోవైపు సినిమాల పరంగా కూడా ఫుల్ బిజీగా ఉంది అనసూయ. ఇటీవలే దర్జా సినిమా ఫినిష్ చేసిన ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా కూడా కంప్లీట్ చేసింది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేసేందుకు రెడీ అవుతోంది.