Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలోొ ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రేమికుల రోజున తన భర్తతో కలిసి రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది అనసూయ.
ఇంతింతై అన్నట్టు చిన్న చిన్న యాంకర్ వేషాలు వేసుకుంటూ చిన్నగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక ఈమె వీలైనపుడల్లా.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. (Instagram/Photo)
అనసూయ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది అనసూయ. ఇదిలా ఉంటే ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు.ఆమె కాలేజ్ డేస్ లో ఎన్ సీ సీ (NCC)లో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకొని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరువురి కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది అనసూయ. (Instagram/Photo)
అనసూయ అప్పుడెప్పుడో 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది.. వెంటనే జబర్దస్త్ యాంకర్ అయిపోయింది.. ఆ తర్వాత నటిగా మారింది.. ఇప్పుడు స్టార్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల కోసం తనకు పేరు తీసుకొచ్చిన జబర్ధస్త్‌ను విడిచిపెట్టింది అనసూయ. (Instagram/Photo)
అనసూయ తెలుగులో టాప్ యాంకర్స్‌లో ఒకరుగా రాణిస్తున్నారు. అంతేకాదు సినిమాల్లోను మెరుస్తున్నారు. ఇక ఆమె పర్సనల్ విషయాల గురించి వస్తే... అనసూయ 2008లో భద్రుక కాలేజ్ నుండి ఎం.బి.ఎ చేశారు. ఆ తర్వాత ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు అనసూయ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేశారు.(Photo Credit/ Anasuya Instagram)
అనసూయ విషయానికొస్తే.. రీసెంట్గా రవితేజ ఖిలాడిలో దాదాపు హీరోయిన్‌తో సమానమైన పాత్రను చేసింది అనసూయ. ఇక ఇపుడు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’లో అనసూయది పవర్‌పుల్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌తో సమానమైన స్క్రీన్ షేరింగ్ ఉందట. ఆచార్య కంటే ముందు ఈమె చిరంజీవితో కలిసి శుభగృహకు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఉగాది కానుకగా విడుదల చేసిన ఈ యాడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కుష్బూ కూడా నటించింది. (Photo Credit/ Anasuya Instagram)
అనసూయ భరద్వాజ్.. అపుడపుడు మూవీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఇక ప్రతి వారం.. జబర్ధస్త్ కామెడీ షోలో ఏదో ఒక సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చింది. ఈమె షోకు గుడ్ బై చెప్పడం అభిమానులకు ఒకింత నిరాశ అనే చెప్పాలి. అంతేకాదు ఈ షోను తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. (Photo Credit/ Anasuya Instagram)
మొత్తంగా టీవీ షోలు, సినిమాలు, కుటుంబాన్ని అన్నింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ తన లైఫ్‌ను లీడ్ చేస్తూ తనకు తానే సాటి అనిపించుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పుడో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనసూయ 'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం 'కన్యాశుల్కం' ఆధారంగా రానుందట. (Photo Credit/ Anasuya Instagram)
ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్లో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు. (Photo Credit/ Anasuya Instagram)