Anasuya: బెడ్‌పై అనసూయ.. అక్కడే ఉంది మ్యాజిక్ అంటూ జబర్దస్తీ గురూ!
Anasuya: బెడ్‌పై అనసూయ.. అక్కడే ఉంది మ్యాజిక్ అంటూ జబర్దస్తీ గురూ!
Anchor Anasuya: ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ వదులుతూ అట్రాక్ట్ చేస్తున్న అనసూయ.. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ వదిలి కుర్రకారు గుండెలను గుచ్చేసింది. శారీ కట్టి మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది.
జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ సుపరిచితం యాంకర్ అనసూయ. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ పేరు ముందు వరుసలో ఉంటుంది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేయడం అనసూయ నైజం.
2/ 9
అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ (NTR) నాగ (Naaga) సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ (Anasuya Bharadwaj). ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది.
3/ 9
జబర్దస్త్ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత వెండితెర వైపు పయనం మొదలుపెట్టి అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటా హవా నడిపిస్తూ ఫుల్ బిజీ అయింది అనసూయ. వెండితెర రంగమ్మత్తగా అనసూయకు యమ డిమాండ్ చేకూరింది.
4/ 9
ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ వదులుతూ అట్రాక్ట్ చేస్తున్న అనసూయ.. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ వదిలి కుర్రకారు గుండెలను గుచ్చేసింది. శారీ కట్టి మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది. బెడ్ పై పడుకొని స్టన్నింగ్ పోజులతో రచ్చ చేసింది.
5/ 9
ఈ ఫొటోస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ మ్యాజిక్ నీలోనే ఉంది.. నిన్ను చూసే విధానంలో కాదంటూ తనదైన స్టైల్ ట్యాగ్ లైన్ రాసింది అనసూయ. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లోనే వైరల్ గా మారాయి. అనసూయ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.
6/ 9
అందానికి అందం, మాటకు మాట అన్నట్లుగా బుల్లితెరపై జబర్దస్త్ జర్నీ చేస్తోంది అనసూయ. అయితే ఈ మధ్యనే టీవీ రంగంపై ఫోకస్ తగ్గించి సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది అనసూయ. రీసెంట్ గా జబర్దస్త్ కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటోంది.
7/ 9
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2తో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది.
8/ 9
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రంగమార్తాండ, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబా సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
9/ 9
'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోందట అనసూయ. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం 'కన్యాశుల్కం' ఆధారంగా వస్తోందని సమాచారం. ఇందులో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్లో అనసూయ కనిపించనుందని టాక్.