ఇంతింతై అన్నట్టు చిన్న చిన్న యాంకర్ వేషాలు వేసుకుంటూ చిన్నగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ఈ భామ తనను ట్రోల్ చేసిన ఓ నెటిజన్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. (Instagram/Photo)
ఆ నెటిజన్ మాటలకు అనసూయ భరద్వాజ్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. మీరు మాత్రం దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనిస్తే బాగుటుంది. మీరు ఇలా అనవసరమైన విషయాల గురించి ఆలోచింది మగజాతి పరువు తీస్తున్నారంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది జబర్ధస్త్ భామ. ఆమె మాటలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. అనసూయ వృత్తిలో భాగంగా డ్రెసింగ్ వేసుకుంటూ ఉంది. అది ఆమె ప్రొఫెషన్. దీన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
అనసూయ విషయానికొస్తే.. రీసెంట్గా రవితేజ ఖిలాడిలో దాదాపు హీరోయిన్‌తో సమానమైన పాత్రను చేసింది అనసూయ. ఇక ఇపుడు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’లో అనసూయది పవర్‌పుల్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌తో సమానమైన స్క్రీన్ షేరింగ్ ఉందట. ఆచార్య కంటే ముందు ఈమె చిరంజీవితో కలిసి శుభగృహకు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఉగాది కానుకగా విడుదల చేసిన ఈ యాడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కుష్బూ కూడా నటించింది. (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమాలో నటించడానికి అనసూయకు దాదాపు రూ. 20 లక్షల వరకు పారితోషకం ఇచ్చినట్టు సమాచారం. ఆమె పాత్రకున్న పరిధి మేరకు ఇంత ముట్టజెప్పినట్టు సమాచారం. ఇక అనసూయ విషయానికొస్తే.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కేవలం గ్లామర్ షోకే పరిమితమైన అనసూయ.. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ తో పాటు రామ్ చరణ్,సుకుమార్‌ల ‘రంగస్థలం’ మూవీలతో నటిగా అనసూయ స్టామినా ఏంటో ప్రేక్షకులకు తెలిసొచ్చింది. దీంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. (Twitter/Photo)
అనసూయ భరద్వాజ్.. అపుడపుడు మూవీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ప్రతి వారం.. జబర్ధస్త్ కామెడీ షోలో ఏదో ఒక సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ షోను తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. (Instagram/Photo)
తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక ‘క్షణం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. అంతేకాదు ఎప్పటి కపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. (Instagram/Photo)
ఇక అనసూయ పాపులారిటీ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. పక్కనున్న భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో అలీస్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనసూయకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Instagram/Photo)
మరోవైపు ఆమె.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’తో పాటు భోళా శంకర్ సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇక ఆచార్యలో మంచి రోల్ చేసిందట. ఇంకోవైపు అనసూయ రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. (Instagram/Photo)
ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. అటు చిరంజీవి , కొరటాల శివల ‘ఆచార్య’లో పవర్ఫుల్లో కనిపించనుంది. మొత్తంగా అనసూయ కెరీర్ మూడు పోగ్రాములు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. (Instagram/Photo)