ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. ఈ నేపథ్యంలో అనసూయ పలువురు నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లైన మీరు.. ఇలా కురుచ దుస్తుల్లో కనిపించి తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారంటూ కామెంట్స్ ఈమెపై వచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. (Instagram/Photo)
అనసూయ తెలుగులో టాప్ యాంకర్స్‌లో ఒకరుగా రాణిస్తున్నారు. అంతేకాదు సినిమాల్లోను మెరుస్తున్నారు. ఇక ఆమె పర్సనల్ విషయాల గురించి వస్తే... అనసూయ 2008లో భద్రుక కాలేజ్ నుండి ఎం.బి.ఎ చేశారు. ఆ తర్వాత ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు అనసూయ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేశారు. (Instagram/Photo)
అనసూయ విషయానికొస్తే.. రీసెంట్గా రవితేజ ఖిలాడిలో దాదాపు హీరోయిన్‌తో సమానమైన పాత్రను చేసింది అనసూయ. ఇక ఇపుడు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’లో అనసూయది పవర్‌పుల్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌తో సమానమైన స్క్రీన్ షేరింగ్ ఉందట. ఆచార్య కంటే ముందు ఈమె చిరంజీవితో కలిసి శుభగృహకు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఉగాది కానుకగా విడుదల చేసిన ఈ యాడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కుష్బూ కూడా నటించింది. (Twitter/Photo)
అనసూయ భరద్వాజ్.. అపుడపుడు మూవీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ప్రతి వారం.. జబర్ధస్త్ కామెడీ షోలో ఏదో ఒక సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ షోను తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. (Instagram/Photo)
మరోవైపు ఆమె.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’తో పాటు భోళా శంకర్ సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు అనసూయ రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. మొత్తంగా టీవీ షోలు, సినిమాలు, కుటుంబాన్ని అన్నింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ తన లైఫ్‌ను లీడ్ చేస్తూ తనకు తానే సాటి అనిపించుకుంటోంది. (Instagram/Photo)