Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. రీసెంట్గా రిపబ్లిక్ డే రోజు మహాత్మ గాంధీపై ఈమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగాయి. (Instagram/Photo)
అనసూయ భరద్వాజ్.. అపుడపుడు మూవీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ప్రతి వారం.. జబర్ధస్త్ కామెడీ షోలో ఏదో ఒక సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ షోను తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. (Instagram/Photo)
తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక ‘క్షణం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. అంతేకాదు ఎప్పటి కపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. (Instagram/Photo)
ఇక అనసూయ పాపులారిటీ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. పక్కనున్న భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో అలీస్ పాత్రలో నటిస్తోంది. తాజాగా అందులో అనసూయకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Instagram/Photo)
కళ్లద్దాలతో క్యూట్ లుక్స్‌తో ఉన్న అనసూయను అభిమానులు మురిసిపోతన్నారు. రీసెంట్గా ‘పుష్ప’ మూవీలో దాక్షాయణిగా నటించింది. ఈ పాత్ర అనసూయకు అంతగా సూట్ కాలేదని అభిమానులు సోషల్ మీడియాల వేదికగా చెబుతున్నారు. ’పుష్ప’ లాంటి ఫైర్ ఉన్న పాత్ర ముందు దాక్షాయణిగా ఆమె పాత్ర తేలిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Instagram/Photo)
మరోవైపు ఆమె.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు అనసూయ రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. (Instagram/Photo)
ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. మొత్తంగా అనసూయ కెరీర్ మూడు పోగ్రాములు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. (Instagram/Photo)