ఇంతింతై అన్నట్టు చిన్న చిన్న యాంకర్ వేషాలు వేసుకుంటూ చిన్నగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. (Instagram/Photo)
అనసూయ విషయానికొస్తే.. రీసెంట్గా రవితేజ ఖిలాడిలో దాదాపు హీరోయిన్‌తో సమానమైన పాత్రను చేసింది అనసూయ. ఇక ఇపుడు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’లో అనసూయది పవర్‌పుల్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌తో సమానమైన స్క్రీన్ షేరింగ్ ఉందట. ఆచార్య కంటే ముందు ఈమె చిరంజీవితో కలిసి శుభగృహకు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఉగాది కానుకగా విడుదల చేసిన ఈ యాడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కుష్బూ కూడా నటించింది. (Twitter/Photo)
అనసూయ భరద్వాజ్.. అపుడపుడు మూవీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ప్రతి వారం.. జబర్ధస్త్ కామెడీ షోలో ఏదో ఒక సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ షోను తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. (Instagram/Photo)
తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక ‘క్షణం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. అంతేకాదు ఎప్పటి కపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. (Instagram/Photo)
ఇక అనసూయ పాపులారిటీ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. పక్కనున్న భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో అలీస్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనసూయకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Instagram/Photo)
జబర్ధస్త్ కామెడీ షోకు వచ్చిన తర్వాత అనసూయ ఆస్తుల చిట్టా కూడా అంత కంతకు పెరిగిపోయిందనే టాక్ వినబడుతోంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సుమ తర్వాత సంపాదన విషయంలో టాప్‌లో ఉంది అనసూయ. కేవలం జబర్ధస్త్ షోతోనే ఈమె ఆదాయం పెరిగింది. ఈ షోతోనే వచ్చిన పాపులారిటీతో ఈమె సినిమాలు కూడా చేస్తోంది. అంతేకాదు సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అనసూయ.. కేవలం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్థస్త్ షోతో పాటు పలు టీవీ ఛానెల్స్‌లో ప్రోగ్రామ్స్ చేస్తోంది. (Instagram/Photo)
ఆ మధ్య అనసూయ ఇన్కమ్ టాక్స్ ఎగ్గోట్టొందనే పుకార్లు వినపడ్డాయి. అంతేకాదు కొంత మంది ఆదాయ పన్ను అధికారులు ఆమె నివాసంపై దాడులు కూడా నిర్వహించారు. ఈమె ఆదాయంపై జబర్ధస్త్ కమెడియన్స్ అపుడుపుడు జోకులు కూడా చేస్తుంటారు. ఈమెకు జూబ్లిహిల్స్‌లో దాదాపు రూ. 8 కోట్లు విలువ చేసే ఇల్లు.. కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు రెండు కార్లు.. దాదాపు వీటి విలువ రూ. 2.50 కోట్ల వరకు ఉంటుందట. మొత్తంగా ఈమెకు రూ. 25 కోట్ల పైనే ఆస్తులున్నట్టు సమాచారం. (Instagram/Photo)
ఎంత లేదన్న అనసూయ ప్రతి ఇయర్ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు సంపాదిస్తోంది. అందులో కేవలం జబర్ధస్త్ కామెడీ షో ద్వారానే రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఏమైనా సినిమా ఫంక్షన్స్, ఈవెంట్స్ గట్రా ఉంటే.. అది అదనం. మొత్తంగా జబర్ధస్త్ అనే ఒకే ఒక్క షోతో అనసూయ జాతకం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.(Twitter/Photo)