Anasuya: మొత్తుకుంటున్నా వింటున్నారా..? ఆయన చెప్పిందే నిజం.. అనసూయ కామెంట్స్ వైరల్
Anasuya: మొత్తుకుంటున్నా వింటున్నారా..? ఆయన చెప్పిందే నిజం.. అనసూయ కామెంట్స్ వైరల్
Anchor Anasuya: వీలుకుదిరినప్పుడల్లా నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటోంది అనసూయ. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది అనసూయ. అయితే నెగెటివ్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అనసూయ.. తాజాగా అదే కోణంలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
యాంకర్ అనసూయ అనగానే టకీమని గుర్తొచ్చే సీన్ జబర్దస్త్. ఇదే వేదికగా పాపులర్ అయిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందచందాలతో హల్చల్ చేస్తోంది.
2/ 10
వీలుకుదిరినప్పుడల్లా నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటోంది అనసూయ. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది అనసూయ. అయితే నెగెటివ్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అనసూయ.. తాజాగా అదే కోణంలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
3/ 10
సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేయడంపై తాజాగా అనసూయ రియాక్ట్ అయిన తీరు ఆమెను వార్తల్లో నిలిపింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇటీవల పఠాన్ చిత్ర ప్రెస్ మీట్ లో చెప్పిన వ్యాఖ్యలని ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ పెట్టింది అనసూయ.
4/ 10
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దాడి చేస్తోంది. ఇప్పటికే 600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూ పలు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించారు.
5/ 10
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దాడి చేస్తోంది. ఇప్పటికే 600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూ పలు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించారు.
6/ 10
అయితే తాజాగా షారుక్ స్పందిస్తూ.. డర్, బాజీగర్ చిత్రాల్లో నేను నెగిటివ్ రోల్స్ చేశాను. జాన్ అబ్రహం కూడా చాలా నెగిటివ్ రోల్స్ చేశాడు. అయితే మేమంతా చెడ్డవాళ్ళం అని కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఇలాంటి పాత్రలు పోషిస్తాం అని చెప్పారు.
7/ 10
అయితే షారుక్ చెప్పిన ఈ మాటలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. నేను ఎప్పటినుంచో మొత్తుకుంటోంది ఇదే. మేము నెగిటివ్ రోల్స్ లో నటించినంత మాత్రాన రియల్ లైఫ్ లో మా క్యారెక్టర్ అలా ఉండదు అని అనసూయ పేర్కొంది. ఈ రకంగా మరోసారి తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది అనసూయ.
8/ 10
బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ పేరు ముందు వరుసలో ఉంటుంది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేయడం అనసూయ నైజం. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై బలమైన క్యారెక్టర్స్ చేస్తోంది అనసూయ.
9/ 10
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2తో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. సినిమా అవకాశాల వేట కొనసాగిస్తూ పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్.
10/ 10
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రంగమార్తాండ, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబా సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.