టీవీల్లో తమన్నా కంటే అనసూయకు ఫాలోయింగ్ ఎక్కువ అనుకున్నారో ఏమో అనసూయ ఎంట్రీ ఇచ్చినా.. ఈ ప్రోగ్రామ్ రేటింగ్ ఏ మాత్రం మెరుగుపడలేదు. మరింత దారుణంగా ఈ షో రేటింగ్ దిగజారిందని ఈ షోకు వచ్చే టీఆర్పీ చూస్తే చెప్పొచ్చు. ఈ షోకు దారణమైన రేటింగ్ రావడం ఈ షో నిర్వాహకులు ఏం చేయాలో పాలు పోవడం లేదు. అనవసరంగా ఈ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసామా అని తలలు పట్టుకుంటున్నారట. Anchor Anasuya Photo : Instagram
మొత్తంగా జబర్ధస్త్ భామ అనసూయ ఎంట్రీతోనైనా ఈ షోకు రేటింగ్ వస్తుంది. ఇక ప్రోగ్రామ్‌ను కంటిన్యూ చేయాలనుకున్నా టీమ్‌కు త్వరలోనే దీనికి మంగళం పాడాలనుుకంటున్నారు. అనసూయతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెల రోజులు చేసి ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్‌కు ప్యాకప్ చెప్పేయాలనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా తమన్నా వల్ల రాని రేటింగ్ అనసూయతో వస్తుందనుకున్న నిర్వాహకులకు ఇపుడు ఇది పెద్ద షాకే అని చెప్పాలి. ఒక రకంగా అనసూయకు ఇది ఘోర అవమానమే అని చెబుతున్నారు ఆమె అభిమానులు. మొత్తంగా ఎరక్కపోయి అనసూయ బాగానే ఇరుక్కుందనే చెప్పాలి.