Ananya Pandey:
బాలీవుడ్ నటి అనన్య పాండే కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. అయితే ఆ పార్టీలో ఆమె వేసుకున్న డ్రెస్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. హాలీవుడ్ హీరోయిన్ కెండల్ జెన్నర్‌ను ఈ స్టార్ కిడ్ కాపీ కొట్టిందని ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీకి సీనీ ప్రముఖులంతా తరలివచ్చారు. ఈ పార్టీ యంగ్ బ్యూటీ కూడా చాలా అందంగా కనిపించింది.
2/ 8
కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి బాలీవుడ్ హీరోయిన్లు ఐశ్వర్యరాయ్, కాజల్, రాణి ముఖర్జీ, జూహీ చావ్లా కూడా హాజరయ్యారు.
3/ 8
ఈ పార్టీలో అనన్య పాండే ధరించిన వైట్ షైన్ కలర్ డిజైనర్ డ్రెస్ గురించి ట్రోలింగ్ నడుస్తోంది. పార్టీకి హాజరైన పలువురు హీరోయిన్లు అనన్య పాండే డ్రెస్ విషయంలో కాపీ కొట్టిందని కామెంట్ చేస్తున్నారు.
4/ 8
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే, హాలీవుడ్ నటి కెండల్ జెన్నర్ డ్రెస్‌ను కాపీ కొట్టిందని ఆమెపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
5/ 8
లైగర్ బ్యూటీ అనన్యాపాండే వేసుకొచ్చిన వైట్ షైన్ కలర్ డిజైనర్ వేర్పైనే తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పార్టీకి అటెండ్ అయిన వాళ్లలో చాలా మంది హీరోయిన్లు బ్లాక్ డ్రెస్సులో పిక్కలు కనిపించేలా ఫోజులిస్తే..అనన్యాపాండే మాత్రం కాపీ కొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.
6/ 8
అనన్య పాండే ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవొండా సరసన లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
7/ 8
అనన్య పాండే షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్‌తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుంది. అయితే వారిద్దరూ ప్రస్తుతం విడిపోయారని చెప్పుకుంటున్నారు.
8/ 8
అయితే కరణ్ బర్త్ డే పార్టీలో అనన్య పాండే మాత్రమే కాదు, చాలా మంది హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సులపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.