నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రగతి ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రతీ సినిమాలో హీరో, హీరోయిన్ కు ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో క్యారెక్టర్ ఆర్టిస్టుకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న ప్రగతి ఇమేజ్ డిఫరెంట్.. ప్రగతి ముఖ్యంగా హీరోయిన్స్‌కు తల్లిగా ఎక్కవ సినిమాల్లో కనిపించారు. అంతేకాదు సినిమల్లో హీరోలకు అమ్మగా.. అత్తగా.. వదినగా.. నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ప్రగతి. వీరికి చాలా మంది మహిళా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. Photo : Instagram
ఇక ఈ నటుల పారితోషికం ఎలా ఉంటుందన్న విషయానికి వస్తే.. వీరికి రోజూవారీగా రెమ్యూనరేషన్ ఉంటుంది. వారు ఎన్ని రోజులు నటిస్తారో.. అన్ని రోజులకు వారికి కొంత మొత్తాన్ని చెల్లిస్తారు దర్శక నిర్మాతలు. ప్రగతి ఒక్కరోజు కాల్షీట్ కోసం దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. అయితే ఇది అన్ని సినిమాలకు ఒకేలా ఉండక పోవచ్చు. పెద్ద సినిమాలకు ఓ రకంగా.. చిన్న సినిమాలకు ఓ రకంగా ఉంటుంది. అంతేకాదు పాత్ర ఇంపార్టెన్స్‌ను బట్టి కూడా మారోచ్చు. Photo : Instagram
Actress Pragathi : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. అలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. Photo : Instagram
ఇక తాజాగా ఈ సీనియర్ నటి సమ్మర్లో ఓ రెస్టారెంట్లో చిల్ అవుతూ.. లైట్ గ్రీన్ టాప్‌లో ఫోటోలకు పోజులిచ్చారు. అంతేకాదు ఆ ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్టైలీష్ లుక్‌లో కేక పెట్టించారని, కూల్‌గా అదరగొట్టారంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. Photo : Instagram
అది అలా ఉంటే ఆమె ఇటీవల ఓ ఇంటర్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. తన సినీ కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదట ప్రగతి. ఇండస్ట్రీలో కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపినట్లు సమాచారం. Photo : Instagram
ఇక మరోవైపు ప్రగతి ముఖ్యంగా పోయిన లాక్డౌన్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. అప్పటి నుంచి తరచూ ఫిటినెస్ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు అదిరిపోయే స్టెప్పులతో కేకపెట్టించారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram
తాజాగా ప్రగతి హీరోయిన్ మెహ్రీన్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. పనిచేసే చోట స్నేహబంధం అల్లుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుందని పేర్కొన్నారు. సినిమాలో కూతురు కాస్తా నిజజీవితంలోనూ తన కూతురు అయింది అంటూ మెహ్రీన్ ని తన బిడ్డగా భావిస్తున్నట్టు తెలిపారు ప్రగతి. ఇదంత దేనికి అంటే ఎఫ్2 చిత్రంలో ప్రగతి, మెహ్రీన్ తల్లీకూతుళ్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య బాండ్ అలా కొనసాగుతోందట. దీంతో మెహ్రీన్ తన కూతురు లాంటిదని తెలిపారు ప్రగతి. ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం ఎఫ్ 3లో నటించారు. Photo : Instagram
ప్రగతికి హీరోయిన్ రెజీనాతో కూడా మంచి అనుబంధం ఉందట. ఈ విషయాన్ని ప్రగతి గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. రెజీనా తన కూతురు వంటిదని చెప్పారు. తనను రెజీనా అమ్మ అనే పిలుస్తుందని అన్నారు. సాయితేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం నుంచి రెజీనాకు తనకు మధ్య మంచి బంధం ఏర్పడిందని తెలిపారు. Photo : Instagram
మెహ్రీన్, రెజీనా మాత్రమే కాదు.. గోవా బ్యూటీ ఇలియానా కూడా ప్రగతితో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారట. పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం నుంచి ప్రగతి, ఇలియానా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇలియాన హెయిర్ డ్రస్సర్ రాకపోతే ప్రగతి దగ్గరుండి ఇలియానాకు రెండు జడలు వేసారట. Photo : Instagram
ఇక ప్రగతి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు సినిమాల్లో ప్రగతి ముఖ్యంగా అమ్మగా, వదినగా, అక్కగా, చెల్లిగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఎఫ్ 3 విషయానికి వస్తే.. ఇక ఈ సినిమా ఇటీవల విడుదలైంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. ఈ నెల 27న విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. . Photo : Instagram
ఆద్యంతం కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. దీంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసేందకు ఎగబడుతున్నారు. అనిల్ రావిపూడి కేవలం ఈ సినిమా టైటిల్‌ను మాత్రమే వాడుకొని అవే పాత్రలతో ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు.వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా.. అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. .
F3 మూవీని అనిల్ రావిపూడి పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించారు. ఇక సినిమా చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఆడియన్స్. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రేక్షకులకు ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. . Photo : Instagram
ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు.మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో మెరిసారు.. Photo : Instagram