తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ రాలేదు. ఈ మధ్యే 40 వసంతాలు పూర్తి చేసుకుని.. 41కి చేరవైంది అనుష్క.
దీనిపై అటు ప్రభాస్.. ఇటు అనుష్క నో అనే సమాధానాలే చెప్పారు. అయినా కూడా వీళ్ల మధ్య రూమర్స్ ఆగడం లేదు. ఇక ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వస్తున్నాయి. కాకపోతే కాస్త మెల్లగా వస్తున్నాయంతే.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది. ప్రస్తుతం జేజమ్మ మనసు అంతా సినిమాలపైనే ఉంది.
మునపట్లా ఇప్పుడు అవకాశాలు మాత్రం రావడం లేదు. గతేడాది కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన ‘నిశ్శబ్ధం’ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఇతర సినిమాలేవీ ఒప్పుకోలేదు అనుష్క. ఇదిలా ఉంటే తన పెళ్లి ఇప్పట్లో ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చింది అనుష్క. పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది అనుష్క.
గత కొన్నేళ్లుగా కేవలం ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ మాత్రమే చేస్తుంది. రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ చెప్పిన ఒక కథ అనుష్కకు నచ్చినా.. అనివార్య కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి పూర్తిగా ఖాళీ అయిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. దాంతో అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.
దీనిపై ఒక జ్యోతిష్కుడు అసలు విషయం బయట పెట్టాడు. అనుష్కను చాలా కాలంగా చూసిన వాడు.. ఎన్నో రోజులుగా గమనిస్తున్న ఓ కర్ణాటక జ్యోతిష్కుడు జేజమ్మ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసాడు. అనుష్క తన వృత్తిలో చాలా సిన్సియర్‌గా ఉంటుందని.. అలాగే ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు.