Home » photogallery » movies » AMMU ABHIRAMI VENKATESH NARAPPA FAME DO YOU KNOW FACT ABOUT HEROINE TA

Ammu Abhirami: నారప్ప‌ హీరోయిన్‌ ‘అమ్ము అభిరామి’ గురించి ఈ విషయాలు తెలుసా..

Ammu Abhirami: వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్ టైటిల్ రోల్ ‘నారప్ప’ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అంతేకాదు ధనుశ్ చేసిన ‘అసురన్’ సినిమాను యథావిధిగా తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అయ్యాడనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో వచ్చే వెంకటేష్ మేన కోడలు పాత్రలో నటించి అమ్ము అభిరామి గురించే అందరు మాట్లాడుకుంటున్నారు.