Amitabh Bachchan Remakes | రీమేక్... ఈ పదం ఇప్పుడు భలే క్రేజీగా మారిపోయింది. ఏ సినిమా హిట్టైనా... దాన్ని మిగతా భాషల్లో రీమేక్ చేయటానికి హీరోలు, దర్శకులు ఎగబడుతున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా హిట్టైన ‘పింక్’ సినిమాకు రీమేక్. మొత్తంగా తెలుగులో రీమేక్ అయిన అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాల విసయానికొస్తే..
జంజీర్ -నిప్పులాంటి మనిషి | ఎన్టీఆర్ తన 52వ ఏట ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్ లో నటించగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. పోలీస్ కేరెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ‘నిప్పులాంటి మనిషి’ సినిమా. ఈ చిత్రాన్ని హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ కు రీమేక్. (Twitter/Photo)
షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశాడు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. అలాగే ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశాడు. ఆ సినిమానే అజిత్ సరికొత్తగా అదే టైటిల్ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇక తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
హేరాఫేరి - రామకృష్ణులు | ‘హేరాఫేరి’.. అమితాబ్ చేసిన ఎవర్ గ్రీన్ మల్టీ స్టారర్స్లో ఇదొకటి. ఈ అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని హిందీలో బిగ్ బీతో కలిసి వినోద్ ఖన్నా చేశాడు. తెలుగులో నందమూరితో అక్కినేని కలిశారు అందుకే ‘రామకృష్ణులు’ అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ స్వీట్ మెమరీ. (Twitter/Photo)
లావారిస్ - నా దేశం | అమితాబ్ సినిమాల్లో ‘లావారిస్’ సినిమాను ఎవ్వరూ మరిచిపోలేరు. బిగ్ బీ బిగ్ హిట్టైన ‘లావారిస్’ మూవీని తెలుగులో మళ్లీ ఎన్టీఆర్ ‘నా దేశం’ పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీ విడుదలైన 70 రోజులకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా 1983 జనవరి 9న ప్రమాణ స్వీకారం చేసారు. (Youtube/Credit)
కుమరరాజా - మహాన్ | కృష్ణ హీరోగా నటించిన ‘కుమార్ రాజా’ మూవీ హిందీలో అమితాబ్ ‘మహాన్’గా రీమేక్ చేసాడు. తెలుగులో కశ్మర్ నేపథ్యంలో తెరకెక్కిస్తే.. హిందీలో నేపాల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఈ సినిమాను ముందుగా కన్నడలో రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘శంకర్ గురు’ సినిమాకు రీమేక్. 1978లో విడుదలైన ఈ సినిమాను కృష్ణ అదే యేడాది ‘కుమార్ రాజా’ గా రీమేక్ చేసి విడుదల చేసారు. మరోవైపు అమితాబ్ ఈ చిత్రాన్ని 1983లో రీమేక్ చేసారు. (Twiter/Photo)
ముఖ్యమంత్రి - ఇంక్విలాబ్ | అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఇంక్విలాబ్’ కన్నడలో అంబరీష్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’సినిమాకు రీమేక్. ఈ సినిమాను బిగ్‌బీ ‘ఇంక్విలాబ్’గా రీమేక్ చేసి హిట్టు అందుకున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘ముఖ్యమంత్రి’ పేరుతో విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. (Twitter/Photo)
రోటీ కప్డా ఔర్ మఖాన్ - జీవన పోరాటం | తెలుగులో అమితాబ్ సినిమాల్ని చాలా ఆసక్తిగా రీమేక్ చేసిన హీరో శోభన్ బాబు. చాలా సినిమాలు హిందీ నుంచి ఇక్కడికి తెచ్చిన మన సొగ్గాడు... సక్సెస్ లు కూడా బాగానే కొట్టాడు.‘రోటీ కప్డా ఔర్ మకాన్’ సినిమా ‘జీవన పోరాటం’ అయింది. కానీ ఈ మూవీలో మాత్రం శోభన్ బాబు ...మనోజ్ కుమార్ పాత్రలో నటిస్తే..రజినీకాంత్ బిగ్‌బీ క్యారెక్టర్ చేశారు.(File/Photo)
ముఖద్దర్ కా సికందర్ - ప్రేమ తరంగాలు | అంతే కాదు, చిరంజీవితో కలిసి ‘ప్రేమ తరంగాలు’ అనే సినిమా కూడా చేశారు. ఈ సినిమా బాలీవుడ్ మెమరబుల్ మూవీ ‘ముఖద్ధర్ కా సికందర్’ కి రీమేక్. అమితాబ్ ‘ముఖద్ధర్ కా సికందర్’ తెలుగులో ‘ప్రేమ తరంగాలు’గా రీమేకైతే.. అందులో చిరు నటించాడు. అయితే, మెగాస్టార్ మాత్రం బిగ్ బీ పాత్రలో మాత్రం కనిపించలేదు. (File/Photo)
నసీబ్ - త్రిమూర్తులు | వెంకటేష్ అమితాబ్ చేసిన ‘నసీబ్’ సినిమాని తెలుగులో చేసి సక్సెస్ కొట్టాడు. ‘త్రిమూర్తులు’ పేరుతో వచ్చిన ఈ రీమేక్‌లో వెంకటేష్’తో పాటూ అర్జున్, రాజేంద్రప్రసాద్‌లు కూడా మనకు కనిపిస్తారు. ఇందులో వెంకటేష్.. అమితాబ్ పాత్రలో నటిస్తే.. అర్జున్.. శతృఘ్న సిన్హా పాత్రలో యాక్ట్ చేసాడు. రాజేంద్ర ప్రసాద్.. రిషీ కపూర్ క్యారెక్టర్లో మెరవడం కొసమెరుపు. (Twitter/Photo)
బంటీ ఔర్ బబ్లీ - భలే దొంగలు | అమితాబ్ చిత్రాల్ని రీమేక్ చేసుకోటం ఆయన హీరో పాత్రలు చేసినంత వరకే అనుకుంటే పొరపాటు. ఆయన క్యారెక్టర్ రోల్స్ కి వచ్చేశాక కూడా రీమేక్‌ల పరంపర సాగుతూనే వచ్చింది. స్మాల్ బి నటించిన ‘బంటీ ఔర్ బబ్లీ’ తెలుగులో ‘భలే దొంగలు’గా రీమేకైంది. తరుణ్ అభిషేక్ పాత్రలో కనిపిస్తే అమితాబ్ చేసిన ఇంట్రస్టింగ్ రోల్‌ను జగపతిబాబు చేశాడు. (Twitter/Photo)
ఖాకీ - సత్యమేవ జయతే | అమితాబ్ డ్యూయెట్స్ పాడే హీరో రోల్స్ మానేశాక చేసిన చిత్రం ‘ఖాకీ’. 2004లో వచ్చిన ఈ సినిమాని టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ రీమేక్ చేశాడు. బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిదేమి లేదు ఈ సినిమా విషయంలో. ‘సత్యమేవ జయతే’ పేరుతో రాజశేఖర్ చేసిన ఈ ప్రయత్నం విఫలమైంది. (file/Photo)
హమ్ - బాషా | అమితాబ్ బచ్చన్ సినిమాల్ని అఫీషియల్‌గా రీమేక్ చేసిన క్రియేటివ్ పీపుల్ కొందరైతే ... మరి కొందరు ఆయన సినిమాలని చూసి ఇన్ స్పైర్ అయ్యారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు చూసి కొందరు దర్శకులు ప్రేరణ తెచ్చుకుని కొత్త కథలు రాసుకున్నారు. ఇక రజినీకాంత్ ‘బాషా’ సినిమాకు అమితాబ్‌తో కలిసి నటించిన ‘హమ్’ సినిమానే ప్రేరణ తీసుకొని రజినీ స్టైల్లో తెరకెక్కించారు. (File/Photo)
చట్టానికి కళ్ళు లేవు - అందా కానూన్ | చాలా మంది తెలుగు హీరోలు అమితాబ్ సినిమాలు రీమేక్ చేశారు. అలాంటి రీమేక్ లో చిరంజీవి కూడా నటించాడు. కాని, ఎప్పుడూ అమితాబ్ పాత్రలో కనిపించలేదు. బట్... బచ్చన్ సాబ్ చిరు మూవీని మాత్రం బాలీవుడ్ తీసుకెళ్లాడు. ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాని ‘అందా కానూన్’ అంటూ హిందీ ఆడియన్స్ ముందుంచాడు. కానీ ఈ బాలీవుడ్ రీమేక్‌లో చిరు పాత్రలో రజినీకాంత్ నటించడం విశేషం. అంతకంటే ముందు ఈ మూవీ తమిళంలో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కింది.(Youtube/Credit)
ఇంక్విలాబ్ - చక్రవ్యూహ | తెలుగు నుంచే కాదు... బిగ్ బీ రీమేక్ చేసిన చిత్రలు తమిళం, కన్నడ నుంచి కూడా వచ్చాయి. కన్నడలో వచ్చిన ‘చక్రవ్యూహ’ సినిమానే బాలీవుడ్లో ‘ఇంక్విలాబ్’. ‘అమితాబ్’ పుట్టగానే వాళ్ల తండ్రి పెట్టిన ఒరిజినల్ పేరు కూడా ‘ఇంక్విలాబే’. అలా ఈ మూవీ మంచి హిట్టై ఇంక్విలాబ్ కి... అదేనండీ, అమితాబ్ కి స్వీట్ మెమరీ గా మిగిలిపోయింది. ఇదే చిత్రాన్ని తెలుగులో కృష్ణ.. ‘ముఖ్యమంత్రి’ టైటిల్‌తో రీమేక్ చేసాడు. (Youtube/Credit)
ముద్దుల మావయ్య - ఆజ్ కా అర్జున్ | దాదాపుగా ఎప్పుడూ రీమేక్‌ల జోలికి వెళ్లని బాలకృష్ణ సహజంగానే అమితాబ్ సినిమాలేవీ తెలుగులో చేయలేదు. కాని, బచ్చన్ మాత్రం ఈ ‘ముద్దుల మావయ్య’ని హిందీ వారి వద్దకు తీసుకెళ్లాడు. ఇక్కడి సూపర్ హిట్ కమర్షియల్ ఎంటర్టైనర్ని అక్కడ ‘ఆజ్ కా అర్జున్’గా రీమేక్ చేశాడు. (Youtube/Credit)
సూర్య వంశం - సూర్యవంశం |అటు వెంకటేష్.. హిట్ సినిమాకి కూడా అమితాబ్ రీమేక్ చేశాడు. ఆ సినిమానే ‘సూర్య వంశం’. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై హిట్టైనప్పటికీ.... హిందీలో నిరాశపరిచింది. అస్సలు అంతకంటే ముందు తమిళంలోనూ శరత్ కుమార్ చేసిన ‘సూర్యవంశం’ సూపర్ హిట్. కాని, బిగ్ బీకి మాత్రం బిగ్ బెనిఫిట్ ఇవ్వలేదు. (Twitter/Photo)
షరాబీ - నీ తండ తనికే |‘షరాబీ’ లాంటి మెమరబుల్ మూవీ కూడా తెలుగు వారు మిస్ అవ్వాల్సి వచ్చింది. తెలుగులో ఏ హీరో చేయని ‘షరాబీ’ మూవీని కన్నడంలో విష్ణువర్ధన్ చేశారు. అక్కడ ‘షరాబీ’ పేరు ‘నీ తండ తనికే’. ఆ టైటిల్ కి అర్థమేంటో గాని... అమితాబ్ చిత్రాల రీమేక్ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోకి జరిగిందని మాత్రం మనకు అర్థమవుతోంది. (File/Photo)
మొత్తంగా పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ ‘పింక్’ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేసాడు. ఇక అమితాబ్ బచ్చన్ ‘పింక్’ సినిమాను ఆల్రెడీ తమిళంలో అజిత్ హీరోగా ‘నేర్కొండ పార్వాయి’గా రీమేక్ అయి సూపర్ హిట్టైయింది. ఏమైనా ఒక హీరో నటించిన ఇన్ని సినిమాలు వేరే భాషల్లో రీమేక్ కావడం అనేది అది ఒక్క అమితాబ్ బచ్చన్ విషయంలోనే సాధ్యమైంది. (File/Photo)