Amitabh Bachchan - Jaya Bachchan | సరిగ్గా 52 ఏళ్ల క్రితం ‘సాత్ హిందూస్థానీ’తో మొదలైన అమితాబ్ బచ్చన్ నట ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్ల కెరీర్లో పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కేసహా పలు అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ 52 ఏళ్ల సినీ కెరీర్లో తన భార్య జయభాదురితో ఆయనది 48 ఏళ్ల అనుబంధం. సరిగ్గా 48 ఏళ్ల క్రితం 1973 జూన్ 3న పెద్దల సమక్షంలో వీళ్లిద్దరు అగ్నిసాక్షిగా ఒకటయ్యారు. ఈ రోజు వీళ్లిద్దరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా అమితాబ్.. తన పెళ్లి నాటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. (Instagram/Photo)
1982లో ‘కూలీ’ చిత్రకరణ సమయంలో అమితాబ్ బచ్చన్ ఒక ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం పాలై ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన కోలుకోవాలంటూ దేశ వ్యాప్తంగా లక్షలాది అభిమానులు ప్రార్థించారు. అంతేకాదు ఆయన చికిత్స కోసం 60 బాటిట్ల రక్తాన్ని అభిమానులు పంపించారు. ఈ సంఘటనతో బిగ్‌బీకి ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో తెలుపుతోంది. (youtube/Photo)