అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ వివాహా బంధానికి 47 ఏళ్లు..

సరిగ్గా 50 ఏళ్ల క్రితం ‘సాత్ హిందూస్థానీ’తో మొదలైన అమితాబ్ బచ్చన్ నట ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్ల కెరీర్‌లో పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కేసహా పలు అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ 50 ఏళ్ల సినీ కెరీర్‌లో తన భార్య జయభాదురితో ఆయనది 47 ఏళ్ల అనుబంధం. సరిగ్గా 47 ఏళ్ల క్రితం 1973 జూన్ 3న పెద్దల సమక్షంలో వీళ్లిద్దరు అగ్నిసాక్షిగా ఒకటయ్యారు. ఈ రోజు వీళ్లిద్దరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా అమితాబ్.. తన పెళ్లి నాటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో పాటు బాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఎవరున్నారో చూద్దాం..