సర్వ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఓ విజువల్ వండర్‌గా ఉండేలా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు నాగ్ అశ్విన్. పాన్ వరల్డ్ స్థాయిలో అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుండటం రెబల్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తోంది.