అయితే ఈ సినిమాలు చేస్తున్న సమయంలో నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నాగచైతన్య మళ్లీ "థాంక్యూ" డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలోనే "దూత" అనే వెబ్ సిరీస్ కు సైన్ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయి చాలా రోజులు గడిచాయి. కానీ ఇంకా ఈ వెబ్ సిరీస్ విడుదలకు నోచుకోలేదు.
"దూత" వెబ్ సిరీస్ బావుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే తప్ప దీనికి అంత బజ్ కూడా రాదు. అందుకే అమెజాన్ వారు "దూత" విడుదలని కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టారట. నాగచైతన్య సినిమా ఏదైనా విడుదల అయ్యి సూపర్ హిట్ అయితే అదే సమయంలో ఈ వెబ్ సిరీస్ ని కూడా విడుదల చేస్తే బాగుంటుందని అమెజాన్ వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. Naga Chaitanya Vikram k kumar Photo : Twitter
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ దీన్ని అమెజాన్ ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందనేది ప్రస్తుతానికి డౌట్ అనే చెప్పాలి. మరోవైపు విక్రమ్ కుమార్ "దూత" సీక్వెల్ కి స్క్రిప్ట్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ఇక వెబ్ సిరీస్ రిజల్ట్ తో పని లేకుండా దీనికి సెకండ్ సీజన్ కూడా ఉందని తెలుస్తోంది.
నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. నాగచైతన్య 22వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతన్య ఒక పవర్ ఫుల్ కాప్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక పోస్టర్ లో నాగచైతన్య లుక్ చాలా ఇంటెన్సిటీతో ఉంది. “సమాజంలో మార్పు కావాలని కోరుకున్నప్పుడు, ఆ మార్పు నీలోనే మొదలవ్వాలి” అనే కాప్షన్ తో సినిమా థీమ్ ని చెప్పాడు దర్శకుడు.