తమన్నా.. ఓ అందాల నటి.. తన అందచందాలతో పాటు మంచి నటనతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో నటిస్తూ అదరగొడుతోంది. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించి అదరగొట్టింది తమన్నా. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోను సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. Photo: Twitter
అందులో భాగంగా ఇప్పటికే నవంబర్ స్టోరిస్ అంటూ పలకరించింది. వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఇక తాజాగా మరో వెబ్ సిరీస్లో కూడా తమన్నా నటించనుందని తెలుస్తోంది. తమన్నా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం ప్యాన్ ఇండియా లెవల్లో ఓ వెబ్ సీరిస్లో నటించనుందని తెలుస్తోంది. నిర్మాత దినేష్ విజన్ దీన్ని నిర్మించనున్నారు. Photo: Twitter