Amala Paul - Upasana : అమలా పాల్, ఉపాసనలకు ఒకేసారి ఆ అరుదైన గౌరవం అందుకున్నారు. UAE ప్రభుత్వం వీళ్లిద్దరికి గోల్డెన్ వీసాతో గౌరవించారు. మన దేశం నుంచి పలువురు సెలబ్రిటీలు యూఏఈ ప్రభుత్వం నుంచి ఈ వీసాను అందుకున్నారు. ఇక ఉపాసన .. మెగా కోడలుగానే కాకుండా.. అపోలో హెల్త్ గ్రూపుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఉంటోంది. మరోవైపు అమలా పాల్ తనదైన సినిమాలతో అలరిస్తోంది.
ఉపాసన విషయానికొస్తే.. టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా.. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. తాజాగా యూఏఈ ప్రభుత్వం వాళ్ల దేశం అందించే అరుదైన గోల్డెన్ వీసాను ఉపాసనకు అందజేశారు. (Instagram/Photo)
అమలా పాల్ (Amala Paul) తెలుగులో నటించింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం బాగా సంపాదించింది. మెగా హీరోల సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత కెరీర్ పీక్‌లో ఉండగానే.. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చిన వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈమెకు యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అందించే గోల్డెన్ వీసాను అందుకున్నారు. (Twittr/Photo)
గతంలో ఈ గోల్డెన్ వీసాను మన దేశం నుంచి షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ ,సునీల్ శెట్టి, అర్జున్ కపూర్, సోనూ నిగమ్, బోనీ కపూర్ అందుకున్నారు. 2019లో యూఏఈ గవర్నమెంట్ ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా ఆధారంగా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. ఇక తమిళం నుంచి త్రిషకు యూఏఈ ఈ గోల్డెన్ వీసాను అందజేసారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ ,పృథ్వీరాజ్ సుకుమారన్, లకు ఈ గోల్డెన్ వీసాను అందుకున్న వాళ్లలో ఉన్నారు. తెలుగు నుంచి ఉపాసనకు ఈ గౌరవం అందుకుంది. (Instagram/Photo)
UAE గోల్డెన్ వీసాతో ఎలాంటి జాతీయ స్పాన్సర్స్ లేకుండానే 10 యేళ్ల పాటు ఆ దేశంలో బిజినెస్ చేసుకోవచ్చు. మన దేశం నుంచి మలయాళీలే ఎక్కువగా యూఏఈలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మలయాళ చిత్ర సీమను ఏలుతున్న నటీనటుకు ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేసారు. ఇక తెలుగు నుంచి మెగా కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసనకు గోల్డెన్ వీసా అందడటంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (Instagram/Photo)