తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించిన అమలాపాల్ కాపురంలో చిచ్చుపెట్టింది హీరో ధనుష్ అని అమలాపాల్ మాజీ భర్త విజయ్ తండ్రి అళగప్పన్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ సీక్రెట్‌ను ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అమలాపాల్, దర్శకుడు విజయ్ 2014లో వివాహం చేసుకున్నారు. వారిద్దరూ రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే, దీనికి తమ వ్యక్తిగత కారణాలేనని చెప్పారు. అయితే, దీనికి సంబంధించిన అసలు కారణాన్ని విజయ్ తండ్రి ఓ అళగప్పన్ బయటపెట్టాడు. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని అమలాపాల్ నిర్ణయించుకుందట. అయితే, ఆ తర్వాత అమలాపాల్‌ను మళ్లీ సినిమాలో నటించాలని ధనుష్ ఒత్తిడి తెచ్చాడు. ధనుష్ నిర్మించిన అమ్మా కణుకు సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. ధనుష్, అమలాపాల్ కలసి రఘువరన్ బీటెక్, వీఐపీ 2 సినిమాల్లో నటించారు. (ఆదై సినిమా) అమలాపాల్‌తో విడిపోయిన తర్వాత విజయ్ మరో డాక్టర్‌ను పెళ్లిచేసుకున్నాడు.