మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదే మరి. అసలే ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూతో తల పట్టుకుని ఉన్న నిర్మాతలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ఇది బెంబేలెత్తిస్తున్న తీరుకు వాళ్లకు కాళ్లు చేతులు ఆడటం లేదు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాలకు ఇప్పుడు ఒమిక్రాన్ గుబులు పట్టుకుంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు మళ్లీ కఠినమైన ఆంక్షల వైపు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రతో సహా మరో ఐదు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇప్పుడు ఇదే బాటలో కూడా వెళ్లింది. కరోనా కొత్త ఓరియెంట్ కోసం కొత్త మార్గదర్శకాలను మహారాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. పబ్లిక్ ప్లేసులలో ప్రజలు గుమికూడొద్దని స్పష్టం చేసింది. అలాగే రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు తేల్చి చెప్పింది.
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు గుమికూడటానికి వీల్లేదని కూడా హెచ్చరించింది ప్రభుత్వం. అలా చేస్తే కచ్చితంగా కరోనా కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం ఉద్దవ్ థాకరే ట్వీట్ చేశారు. ఇకపై కేవలం ఇండోర్ వివాహానికి 100 మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
తెలంగాణ నైట్ కర్ఫ్యూ, సైబారాబాద్ వీధులు నిర్మానుషం, తెలంగాణ న్యూస్" width="576" height="1280" class="size-full wp-image-844276" /> అలాగే అవుట్ డోర్ వివాహాలకు ఆ పరిమితి 250గా ఉంటుంది. జిమ్, స్పా, హోటల్, థియేటర్, సినిమా హాళ్లలో 50 శాతం కెపాసిటీకే అనుమతి ఉంది. రాత్రి 9 గంటల తర్వాత.. ఉదయం 6 గంటల లోపు ఐదుగురి కన్నా ఎక్కువ ఉండొద్దని స్పష్టం చేసింది. మహారాష్ట్ర సహా 5 రాష్ట్రాల్లో ఇదే కంటిన్యూ అవుతుండటంతో ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలకు ఇదే శాపంగా మారుతుంది. అన్నింటికంటే ముందుగా ఈ కర్ఫ్యూకు బలైపోయే సినిమా ట్రిపుల్ ఆర్ అవుతుంది.
హిందీ కలెక్షన్స్ కూడా ఈ సినిమాకు కీలకమే. ఎందుకంటే అక్కడ్నుంచే మేజర్ షేర్ వస్తుంది. అలాంటిదిప్పుడు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ.. నైట్ కర్ఫ్యూ అంటే వసూళ్లపై ఏ స్థాయిలో ప్రభావం పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా ఓ రకంగా ఊహించని దెబ్బ సినిమాకు. ఒమిక్రాన్ కారణంగా ఇదే కంటిన్యూ అయితే సినిమా విడుదల కావడం కూడా కష్టమే.
మధ్యప్రదేశ్ లేటెస్ట్ న్యూస్" width="1600" height="1600" class="size-full wp-image-1132018" /> ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఏపీలో ఇప్పటికీ టికెట్ రేట్ల గురించి చర్చ జరుగుతూనే ఉంది. ట్రిపుల్ ఆర్తో పాటు రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియన్ సినిమానే. మరి ఈ రెండు సినిమాలపై మహారాష్ట్ర తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించబోతుందో..? జనవరి 7న ట్రిపుల్ ఆర్.. 14న రాధే శ్యామ్ విడుదల కానున్నాయి.