అల్లురామలింగయ్య... ఈ పేరు తెలుగు తెరమీద హాస్యానికి చెదిరిపోని చిరునామ. ఆయన తెర మీద కనిపిస్తే చాలు.. నవ్వని ప్రేక్షకులుండరు. హావభావాలతోనే కాదు.. ఆయనన్ను చూస్తే చాలు ప్రేక్షకులు నవ్వుతారు. భారీ ఆకారం లేకపోయినా భీముడి పాత్ర పోషిస్తారు. హాస్యం, విలనిజం.. పాత్ర ఎలాంటిదైనా తనదైన స్టైయిల్ లో నవ్వించగల నవ్వుల రాజు అల్లు రామలింగయ్య. మూడు తరాల ప్రేక్షకులకు హాస్యాన్ని పంచి, నవ్వుల హరివిల్లును పూయించిన అల్లురామలింగయ్య శత జయంతి నేడు. అంతేకాదు తెలుగులో రేలంగి తర్వాత హాస్య నటుల్లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ గౌరవం బ్రహ్మానందం గారికి మాత్రమే దక్కింది. (Twitter/Photo)
ఈ రోజు తాత అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌లో ఆయన విగ్రహాన్ని తన సోదురులు అల్లు వెంటటేష్, శిరీష్‌లతో ఆవిష్కరించిన విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గతేడాది అల్లు అరవింద్.. హైదరాబాద్ గండిపేట సమీపంలో ఈ స్టూడియో నిర్మిస్తున్నట్టు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
మేము ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం మా తాతగారైన అల్లు రామలింగయ్య గారే. మా స్టూడియో ప్రయాణంలో ఆయన ఆశీస్సులు ఎపుడు మాతోనే ఉంటాయన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)