అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బన్నీ ఎంతో ఫేమస్సో .. ఆయన వైఫ్ స్నేహ కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది. స్నేహా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. (Photo Instagram)
బన్నీకి తగ్గట్లు భార్య స్నేహా కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ కూడా ఆ విధంగానే ప్లాన్ చేస్తుంటుంది. అల్లు అర్జున్ కు అతని భార్య స్నేహ కూడా ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి.ఈ దంపతులను స్టైలిష్ కపుల్ అని కూడా ప్రేక్షకులు సంభోదిస్తూ ఉంటారు. ట్రెండ్‌ని స్టార్ట్ చేసేదే వీళ్ళేమో అని ఆశ్చర్యపోయేలా వీళ్ళ డ్రెస్సింగ్ ఉంటుంది. (Photo Instagram)
తాజాగా బన్నీ వైఫ్ అల్లు స్నేహా రెడ్డి బ్లాక్ కలర్ డ్రెస్సులో దిగిన ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో చాలా ట్రెండీగా కనిపిస్తుందామె..ఇక ఈ పిక్ చూసిన బన్నీ ఫ్యాన్స్ స్నేహ అక్క సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా పరమ సుందరి అంటూ పోస్టు పెట్టాడం ఇప్పుడు వైరల్ అవుతుంది. (Photo Instagram)
అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. టైం దొరికితే ఫ్యామిలీని తీసుకొని.. విదేశాలకు విహార యాత్రలకు వెళ్తూ ఉంటాడు. అంతేకాదు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకంటూ ఉంటారు. వాళ్లకు ప్రతి మూమెంట్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. .Photo : Twitter