ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన బన్ని తన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సెర్బియాలోని బెల్గ్రేడ్ వెళ్లారు. అక్కడ తనతో పాటు తన భార్య అల్లు స్నేహారెడ్డి ఇంకా తన 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లారట అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో వేదికగా విషెస్ తెలుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘనంగా పుట్టినరోజు వేడుకల్నీ నిర్వహిస్తున్నారు. అయితే దానికి కృతజ్ఞతగా అల్లు అర్జున్ (Allu Arjun Birthday) ఓ భావోద్వేగపూరిత లేఖను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. Photo : Twitter
ప్రస్తుతం ఆ లేఖ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తన లేఖలో రాస్తూ.. అందరికీ నమస్కారం! ముందుగా, నా పుట్టినరోజున విషెస్ చెప్పిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రేమ, దీవెనలు నన్ను ఇంతదాకా తీసుకొచ్చాయి. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల నుంచి నా కుటుంబం, నా స్నేహితులు అందరూ నా ఎదుగుదలకు కృషి చేశారు. ముఖ్యంగా నా అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. Photo : Twitter
నా ఈ 40 ఏళ్ల అందమైన జీవితంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా ఎదుగుదలకు తోడ్పాటు అందించినందరికి వినయపూర్వకంగా.. ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ భావోద్వేగంగా రాసుకున్నారు. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter
అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ షూటింగ్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ నెలలో మొదలుకావాల్సి ఉంది. అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యేలా లేదని టాక్. దాదాపు మూడు నాలుగు నెలల వరకు ఈ రెండో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించట్లేదని అంటున్నారు. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
దీంతో ఈ సినిమా విడుదల ఈ ఏడాదిలో ఉంటుందో లేదో చూడాలి. ఇక పుష్ప (Pushpa) సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప.Photo : Twitter