Star Kids: ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోలతో పాటు వారి కుమారులు, కుమార్తెలకు కూడా అదే స్థాయిలో అభిమానులున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తనయ సితారతో పాటు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు అదే స్థాయిలో రచ్చ చేసారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ.. గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’లో భరతుడుగా తెరంగేట్రం చేయనుంది. మరోవైపు ఎన్టీఆర్ తనయులు కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. వీళ్ల బాటలో మరికొంత మంది హీరోల తనయులు, కూతుళ్లు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.