అల్లు అర్జున్-రష్మిక మందన్న నటిస్తోన్న పుష్ప: ది రూల్ టాలీవుడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా సక్సెస్ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలను పెంచింది. పుష్ప క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్‌లో విరోధిగా ఫర్హాద్ ఫాసిల్ చూపిస్తూ ఆ హైప్‌ని మరింత పెంచింది.
పుష్ప క్రేజ్ ఖండాంతరాలకు పాకింది. ఇక పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల వేసవిలోనే ఉంటుందని అంటున్నారు. 2023 వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. Pushpa Russia release
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 చిత్ర బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సినిమా కు బడ్జెట్ 400 - 500 కోట్ల మధ్యలో అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పుష్ప బాలీవుడ్లో అంచనాలు లేకుండానే రు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమాకి ఏ మాత్రం వెనకాడకుండా డబ్బులు ఖర్చు పెడుతున్నారని సమాచారం.
సినిమా బడ్జెట్‌నే కాదు.. బన్నీకి పారితోషికం, లాభాలతో కలిపి ఏకంగా 130 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి అంత బడ్జెట్ పెట్టి సుకుమార్ రిస్క్ చేస్తున్నాడని అంతా చర్చించుకుంటున్నారు. మరి పుష్ప ది రూల్ ఎలా ఉంటుందో చూాడాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. Pushpa 2 Geetu (Photo News 18)
[caption id="attachment_1472818" align="alignnone" width="2048"] పుష్ప మొదటి పార్ట్‌కు గాను అల్లు అర్జున్ రూ.45 కోట్లను తీసుకున్నట్లు తెలుస్తుండగా.. రెండో పార్ట్‌కు రూ.120 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్‌కు రూ.18 కోట్లను తీసుకున్నారట. దీంతో రెండో పార్ట్‌కు ఆయన రూ.45 కోట్ల మేర తీసుకోనున్నారని తెలుస్తోంది.
[caption id="attachment_1448386" align="alignnone" width="786"] అలాగే ఈ సినిమాలో ఇతర నటీనటులు, టెక్నిషియన్లకు రూ.75 కోట్ల వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ మొత్తం రూ.400 కోట్లకు పైగానే అవుతుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప 2కు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం, తగ్గేదేలే అంటూ అతడు చిత్తూరు యాసలో చెప్పిన డైలాగులు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కథాంశంగా తెరకెక్కిన పుష్ప సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే సుకుమార్ చెప్పాడు. పుష్ప రిలీజ్ అయి ఏడాది అయినా కూడా ఈ మూవీకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. రష్యాలో కూడా ఇటీవలే పుష్ప సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే.