అల్లు అర్జున్ దూకుడు మాములుగా లేదు. గతేడాది చివరల్లో ఈయన హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమాలో నటనకు బెస్ట్ యాక్టర్‌గా ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్, సైమా సహా పలు అవార్డులు అందుకున్న ఇతను తాజాగా ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో CNN News18 Indian Of The Year అవార్డును అందుకున్నారు.(Twitter/Photo)
ఈ క్యాటగిరిలో అల్లు అర్జున్ పుష్పతో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్‌తో పాటు సంచలన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో పాటు.. గంగూబాయ్ కతియావాడి సినిమాకు గాను ఆలియా భట్, భూల్ భులయ్యా సినిమాలోని నటనకు కార్తీక్ ఆర్యన్ నామినేట్ అయ్యారు. ఇక ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో జ్యూరీ అల్లు అర్జున్‌కు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. (Twitter/Photo)
అది అలా ఉంటే పుష్ప ది రూల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మొన్నటి వరకు ఈ సినిమా దసరా తర్వాత షూటింగ్‌ను ప్రారంభించనుందని టాక్ నడిచింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈసినిమా నవంబర్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అల్లు ఫ్యామిలీ గండిపేట సమీపంలో ఓ పది ఎకరాల్లో కొత్తగా ఓ స్టూడియోను నిర్మించారు. ఈ స్టూడియోలో పుష్ప2 షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. Photo : Twitter
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి.
ఫుష్ప సినిమా చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి కామన్ పీపుల్‌తో పాటు సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ను మెచ్చుకున్నారు. తాజాగా ఈయన నటకు CNN News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎంటర్టైన్మెంట్ విభాగంలో వరించడంతో బన్నికి అందరు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. (Twitter/Photo)