డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సహా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ చేశారు. మొన్న ఇండియా, శ్రీలంక మ్యాచ్ లో రవీంద్ర జడేజా సెంచరీ చేసిన తర్వాత, వికెట్ తీసిన తర్వాత తగ్గేదే లే అంటూ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకున్నాడు.
పుష్ప సినిమాలో బాగా పాపులారిటీ సంపాదించిన సాంగ్ ఏదైనా ఉందంటే అది శ్రీవల్లి సాంగ్. హిందీ, తెలుగు, కన్నడ ఏ భాష అయిన శ్రీవల్లి పాట అదరగొట్టేసింది, ఇక పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు చూసి అంతా షాక్ అయిపోయారు. ఇలా ఎలా చేశాడంటూ... అతడ్ని ఫాలో అవుతూ స్టెప్పులేయడం ప్రారంభించారు. కాలిఫోర్నియాలో శ్రీవల్లి సాంగ్
ఇటీవల, ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అల్లు అర్జున్ తన ఐకానిక్ వాకింగ్ స్టైల్ వెనుక ఉన్న ఆలోచనను తెరిచాడు. డైరెక్టర్ సుకుమార్ వల్లే తాను శ్రీవల్లి పాటలో అలా నడవగాలిగానని అల్లు అర్జున్ చెప్పాడు.‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ అందరూ నీలాగే నడుచుకోవాలి’ అని తన దర్శకుడు సుకుమార్ తనతో చెప్పాడని వెల్లడించాడు.