అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా యూనిట్ ఈ రోజు కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ను కొంచె నిశితంగా గమనిస్తే మీకో విషయం అర్థం అవుతుంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా యూనిట్ ఈ రోజు కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ను కొంచె నిశితంగా గమనిస్తే మీకో విషయం అర్థం అవుతుంది. (Twitter/Photo)
2/ 6
పుష్ప సినిమా ఫస్ట్ లుక్ను మీరు చూస్తే ఇందులో ఉన్న తేడాను గమనించవచ్చు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉంటాడు. అక్కడ ఎడమకాలికి ఆరువేళ్లు కనిపిస్తాయి.
3/ 6
తాజాగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ మాస్ లుక్లో అల్లు అర్జున్ సూపర్ గా కనిపిస్తున్నాడు. అయితే, అందులో కూడా ఎడమకాలు క్లియర్గా కనిపిస్తోంది. కానీ, ఇందులో కాలికి ఐదువేళ్లు మాత్రమే ఉన్నాయి. (Image: Instagram)
4/ 6
అంటే, ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్ చేయనున్నాడా? అనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద డిస్కషన్ మొదలైంది. (Image: Instagram)
5/ 6
అసలు పుష్పరాజ్ హత్యకు గురైతే, ఆ ప్లేస్లో మరో పోలీస్ ఆఫీసర్ అయిన వ్యక్తి ఎంట్రీ ఇచ్చి ఎర్రచందనం మాఫియాకు అడ్డుకట్ట వేస్తాడా? అనే కోణంలో సినిమా ఉంటుందని చర్చిస్తున్నారు. (Image: Instagram)
6/ 6
అల్లు అర్జున్ పుష్ప సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. (Director Sukumar)