ఒకప్పుడు బుల్లితెరపై కొత్త సినిమా వస్తుందంటే సందడి మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో ఓటిటిలు లేవు.. ఉన్నా కూడా విడుదలైన తర్వాత చాలా రోజుల వరకు ఒరిజినల్ ప్రింట్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఎలాంటి సినిమా అయినా.. ఎంత పెద్ద హీరో అయినా నెల రోజుల్లోనే ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. టీవీలో వచ్చే వరకు కూడా సినిమాను చూడకుండా ఆగడం లేదు ప్రేక్షకులు.
కుదిరిన వాళ్లు థియేటర్స్లో.. కుదరని వాళ్లు ఓటిటిలో సినిమాలను చూస్తున్నారు. దాంతో టీవీలో పెద్ద సినిమాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఒకప్పట్లా ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ భారీగా రావడం లేదు. తాజాగా పుష్ప సినిమా టీవీలో మొదటిసారి వచ్చింది. బార్క్ రేటింగ్స్ పరంగా చూసుకుంటే దీనికి తక్కువగానే టిఆర్పీ వచ్చింది. టాప్ 10లో 5వ స్థానంతో సరిపెట్టుకుంది ఈ చిత్రం. మరి తెలుగులో టాప్ 10 టిఆర్పీ సినిమాలేంటో చూద్దాం..