సినిమా స్టోరీ నిడివి ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే కదా. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్.. పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు. (Twitter/Photo)
ముందుగా ఈ సినిమాను ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు ఈ సినిమా ఫస్ట్ పాటను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. డేట్ మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 23 లేదా 24న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి. (Twitter/Photo)