ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా మరో రికార్డు నమోదు చేసింది. (File/Photo)
రష్మిక మందన, Rashmika Mandanna, Fahadh Faasil,పుష్ప మూవీ" width="1600" height="1600" /> సౌత్ టూ నార్త్ వరకు బన్నీ సినిమా అందర్నీ ఆకట్టుకుంది పుష్ప. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బబ్ అన్ని ఏరియాల్లో కలిపి 5 బిలియన్ క్రాస్ చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమాకు యూట్యూబ్‌లో 500 కోట్ల వ్యూస్ రాబట్టడం విశేషం. దక్షిణాదిలో కాకుండా మొత్తంగా ఇండియాలో ఈ రేంజ్లో యూట్యూబ్‌లో వ్యూస్ రాబట్టిన సినిమా ఏది లేదు. ఒక రకంగా పుష్ప మూవీతో అల్లు అర్జున్ మరో రికార్డును నమోదు చేసారు.
ఆర్య నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం.. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసాడు అర్జున్ కపూర్. పుష్ప సినిమా అనేది ఓ ఎక్స్పీరియన్స్ అని.. అది సినిమా కాదంటూ ప్రశంసించారు. కరణ్ జోహార్ సైతం పుష్ప సినిమాను చూసి మెచ్చుకున్నారు. అద్భుతమైన సినిమా.. అద్భుతమైన స్టార్ డమ్.. సూపర్ పర్ఫార్మెన్స్ అంటూ పోస్ట్ చేసాడు.