ఇక అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. Photo : Twitter
అయితే ఈ సినిమాను మరోసారి కేరళలో రిలీజ్ చేస్తున్నారు . డిసెంబర్ 17కు పుష్ప విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా మరోసారి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తోన్నట్లు సమాచారం. డిసెంబర్ 17ను రీ రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.. Allu Arjun Photo : Twitter
పుష్ప 2 డాన్‌గా ఎలా రూల్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన లుక్ చూస్తుంటే.. అది పుష్ప 2లో డాన్ లుక్‌గా ఉంది. నోటిలో సిగార్‌తో కళ్లద్దాలతో స్టైలిష్‌గా ఉన్న అల్లు అర్జున్ లుక్కు అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఏం మేకోవర్ అంటూ అల్లు అర్జున్ను డెడికేషన్‌ను మెచ్చుకుంటున్నారు. (Twitter/Photo)