Allu Arjun - Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. Pushpa Photo : Twitter
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. పుష్ప నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది. Photo : Twitter
అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. మొత్తంగా హిందీలో 20 రోజుల్లో.. రూ. 33.15 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొన్నిచోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఇప్పటికే బాలయ్య, చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలు ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనను మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. Photo : Twitter
ఈ సినిమా హిందీ వెర్షన్ ఇరగదీస్తుండంతో ఈ సినిమాను తాజాగా 100కు పైగా లొకేషన్స్‌లో ఈ రోజు ఓవర్సీస్లో విడుదల చేసారు. ఇక మన దేశంలో నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తోంది. మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది. మొత్తంగా రూ. 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. అంతేకాదు 2021 లో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. Photo : Twitter
ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు రూ. 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా రూ. 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. Photo : Twitter
పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. కొన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఇప్పటికిక అక్కడ పుష్ప సినిమాకు 2 నుంచి 3 కోట్ల వసూళ్లకు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అంటున్నారు. Photo : Twitter
ఇక మరోవైపు ఈ పుష్ప సినిమా అన్ని భాషాల్లో కలిపి 300 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలింది టీమ్. అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా మరొక రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. Photo : Twitter
పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. Photo : Twitter
పుష్ప ది రైజ్ సినిమాలో సమంత చేసిన సంచలన సాంగ్ ఉ అంటావా ఊఊ అంటావా. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది చివర్లో వచ్చిన ఈ పాట సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారిపోయింది. విడుదలకు ముందే ఈ పాట టాప్ సాంగ్ అవుతుందని నమ్మకంగా చెప్పారు పుష్ప యూనిట్. అన్నట్లుగానే ఇప్పుడు ఈ పాట సంచలనాలకు తెరతీస్తుంది. Photo : Twitter