తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు పక్కాగా లెక్కలు తెలుసు. తమ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి.. ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి.. ఎంత మంది ఆర్టిస్టులను తీసుకోవాలి.. వాళ్ళందర్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలి.. ఇలా ప్రతీ ఒక్క విషయంపై వాళ్లకు పట్టు ఉంటుంది. పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు ఈ కోవలోకే వస్తుంటారు. వేస్టేజ్ లేకుండా పక్కాగా అనుకున్న సినిమాను తీసి నిర్మాతల చేతుల్లో పెడుతుంటారు.
వాళ్లు చేసే సినిమాల్లో ఎడిటర్స్‌కు కత్తెర వేయడానికి పెద్దగా పని కూడా ఉండదు. మహా అయితే మరో 15 నిమిషాల సినిమా అదనంగా తీస్తారేమో..? అంత పక్కాగా తాము అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కిస్తుంటారు. కానీ మరికొందరు దర్శకులు ఉంటారు.. ఒక సినిమా నిడివి కావాలంటే.. రెండు సినిమాలకు సరిపోయే ఫుటేజ్ తీస్తుంటారు. కథపై క్లారిటీ లేక కాదు.. కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి. చివరికి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏ సీన్ డిలీట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంటారు.
ఇదే విషయం తను ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చాడు. తనకు ఎక్కువ సన్నివేశాలు తీసే అలవాటు ఉందని చెప్పాడు. నిజానికి ఈయన ముందు రోజు సీన్ రాసుకోడు.. లొకేషన్‌కు వచ్చిన తర్వాత సీన్ రాసుకుంటాడు. దానివల్ల కూడా నిర్మాతలకు నష్టాలు తప్పవు. ఈ అలవాటే నిర్మాతలకు భారంగా మారుతుంది కూడా. తాజాగా పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.