Allu Arjun: పుష్ప ది రైజ్ అంటూ తొలిభాగంలో సందడి చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప ది రూల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా షూట్ కి సంబంధించి అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పుష్ప సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉండేలా ప్రత్యేక శ్రద్ద పెట్టి షూట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ బన్నీ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
2/ 8
పుష్ప ది రైజ్ అంటూ తొలిభాగంలో సందడి చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప ది రూల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ క్రమంగా ఊపందుకుంది. ఇటీవలే హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసిన సుకుమార్.. ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.
3/ 8
రీసెంట్ గానే వైజాగ్‌లో పుష్ప 2 షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని పలు కీలక సన్నివేశాలతో పాటు భారీ రేంజ్ లో ఇంట్రో సాంగ్ షూట్ చేశారని సమాచారం. తాజాగా ఈ షెడ్యూల్ ఫినిష్ కావడంతో అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
4/ 8
వైజాగ్ బీచ్‌లో ఎదురుగా అలలు ఎగిరి పడుతూ ఒడ్డుకు వస్తుండగా, వాటిని చూస్తూ దిగిన ఓ పిక్ పంచుకున్నారు బన్నీ. సముద్రం ఒడ్డున ప్రకృతి అందాలను ఏకాంతంగా ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
5/ 8
`థ్యాంక్యూ వైజాగ్` అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో బన్నీ పోస్ట్ షేర్ చేశారు. విశాఖపట్నం చాలా స్పెషల్ అని పేర్కొంటూ లవ్ సింబల్ కూడా షేర్ చేశారు. దీంతో అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్పరాజ్ వెయిటింగ్ ఇక్కడ అంటూ బన్నీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
6/ 8
ఇక పుష్ప 2 తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుందని సమాచారం. వైజాగ్ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు బన్నీ. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కి పాన్ వరల్డ్ క్రేజ్ దక్కేలా పక్కా ప్లాన్ చేసిన సుకుమార్.. ఈ పుష్ప 2 సినిమాను వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారట.
7/ 8
పుష్ప 2లో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనుందట. మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్న రోల్.. ఈ సినిమాలో మరింత అట్రాక్ట్ ఫుల్‌గా ఉండేలా సుక్కు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
8/ 8
పుష్పలో దాక్షాయణిగా మెప్పించిన యాంకర్ అనసూయ.. మరింత పదునైన క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అంతేకాదు అనసూయతో ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.