స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో వేరేగా చెప్పక్కర్లేదు. పుష్పతో బాక్సాఫీస్ వద్ద బన్నీ క్రీయేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు..ఇలా ప్రతీదీ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’అనే డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పుష్ప సినిమా డైలాగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ... ఆ సినిమా పాటలు కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చేసిన ఐటెం సాంగ్ కూడా అందర్నీ ఊపేసింది. సమంత ఐటం సాంగ్ పై ఇప్పుడు ఓ సినిమా కూడా వచ్చేస్తోంది. అంతేకాకుండా ఇందులో శ్రీవల్లిగా నెషనల్ క్రష్ మందన్నా అదరగొట్టింది. రష్మిక, బన్నీల మధ్య వచ్చే సీన్లు, కెమిస్ట్రీ సినిమాకు బాగా వర్కౌట్ అయింది
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప: ది రైజ్" సినిమా గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించడంతో దీనికి సీక్వెల్‌గా పుష్ప 2 కోసం కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. షూటింగ్ విషయంలో కూడా ఎక్కడ నిర్వహించాలి... ఎలా చేయాలన్న దానిపై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ఈ సినిమాలో సునీల్, రావు రమేష్,అనసూయ, కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు అందరూ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఇండోనేషియా మరియు సింగపూర్‌లో భారీ స్థాయిలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్ప సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో తన అభిమానులను అండ్ ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది అని మేకర్స్ అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో మరొక టాక్ వైరల్ గా మారింది పుష్ప షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని కథనాలు వెలువడుతున్నాయి.
పుష్ప మొదటి భాగాన్ని పూర్తి చేసినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది. మిగిలిన షూటింగ్ ను కొత్త తరహా ప్లానింగ్ తో పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ పార్ట్ సెకండ్ స్క్రిప్ట్ విషయంలో మరిన్ని మార్పులు కావాలని అడగడంతో సుక్కు కొన్ని ప్రధానమైన అంశాలను చేంజ్ చేయడానికి ఇంకాస్త ఎక్కువ సమయాన్ని అడిగినట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమా విజయంతో బన్నీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ తో కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవాలని బన్నీ ఆలోచిస్తున్నాడు. మరి మొత్తానికి పుష్ప2 సినిమా షూటింగ్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభం కానుందో మనకు అఫీషియల్‌గా తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.