Pushpa 2 సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్.. బన్నీ అభిమానులకు బిగ్గెస్ట్ న్యూస్
Pushpa 2 సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్.. బన్నీ అభిమానులకు బిగ్గెస్ట్ న్యూస్
పుష్ప- 2 సినిమా షూటింగ్ ఎప్పుడో షురూ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ ఆలస్యానికి కారణాలేంటి అనే దానిపై సినీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపించగా తాజాగా సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) క్రేజీ కాంబోలో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలుసు. కరోనా పరిస్థితుల తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది.
2/ 9
ఈ చిత్రంలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్, శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే మళ్ళీ ఈ ఇద్దరు హీరోహీరోయిన్లుగా పుష్ప సినిమాకు సీక్వల్ రెడీ చేస్తున్నారు సుకుమార్.
3/ 9
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో షురూ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ ఆలస్యానికి కారణాలేంటి అనే దానిపై సినీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపించగా తాజాగా సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్.
4/ 9
ఈ పుష్ప 2 సినిమాను రేపు అనగా (ఆగస్టు 22) పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్.
5/ 9
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన పుష్ప సినిమాలో ప్రధానంగా లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ సీక్వల్ అంతకుమించి అన్నట్లుగా ఉండాలని సుకుమార్ ఫిక్సయ్యారట.
6/ 9
పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్న ఈ సినిమాకు అందుకు తగినట్టుగా అన్ని సీన్స్‌ను డిజైన్ చేస్తున్నారట సుకుమార్. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్ని సీన్స్ కూడా హైలైట్ కావాలని భావిస్తున్నారట. అందుకు తగ్గ లొకేషన్స్ వేట కొనసాగిస్తున్నారట.
7/ 9
ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే ఇక జెట్ స్పీడులో ఫినిష్ చేసేలా సుకుమార్ స్కెచ్చేశారట. అందుకే కాస్త ఆలస్యమైనా ఓపిక పట్టి ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట సుక్కు.
8/ 9
ఈ చిత్రంలో అనసూయ రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ అనసూయ రేంజ్ పెంచేస్తుందని ఇప్పటినుంచే చెప్పుకుంటూ ఉండటం విశేషం. అదేవిధంగా స్పెషల్ సాంగ్ కోసం కూడా సుకుమార్ వేసిన స్కెచ్ ప్రేక్షకులకు యమ కిక్కివ్వనుందట.
9/ 9
పుష్ప మూవీ ఘన విజయం సాధించడంతో పుష్ప 2పై బన్నీ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా సుకుమార్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో బన్నీ రేంజ్ మరింత పెరుగుతుందని ఆశగా ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.