ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. Allu Arjun Twitter
పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి కామన్ పీపుల్‌తో పాటు సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ను మెచ్చుకున్నారు. (Twitter/Photo) Pushpa Sami Sami Twitter
ఈ చిత్రం పార్ట్ 2 పుష్ప ది రూల్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా బడ్జెట్ ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తుంది. ఇందుకు కారణం పుష్ప పార్ట్ 1 కి వచ్చిన క్రేజే. మైత్రి మూవీ మేకర్స్ మేకింగ్ విషయం లో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను భారీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతుంది.