ఇదిలా ఉంటే మరోవైపు 'పుష్ప ది రూల్' ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్ళబోతోందంటూ ఓ అప్డేట్ ఇప్పటికే వచ్చింది. అయితే ఈ సినిమాలో కూడా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్.. ఇలా తారాగణం భారీగానే వుంది. ఆ తారగణమంతా 'పుష్ప ది రూల్'లోనూ కొనసాగనుంది. ఇప్పుడు రెండో భాగం అయిన పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే... బన్నీ రెమ్యునరేషన్ గురించి ఇప్పటివరకు చాలా వార్తలు వచ్చాయి. బన్నీ పుష్ప 2 కోసం వంద కోట్లు తీసుకుంటున్నాడంటూ సమాచారం అందింది. అయితే తాజాగా మరోసారి బన్నీ రెమ్యునరేషన్ వంద కోట్లు కాదని అంతకుమించి తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో అల్లు అర్జున్ నెంబర్ వన్ అయిపోయాడని సమాచారం.
పుష్ప మొదటి పార్ట్‌కు గాను అల్లు అర్జున్ రూ.45 కోట్లను తీసుకున్నట్లు తెలుస్తుండగా.. రెండో పార్ట్‌కు రూ.125 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్‌కు రూ.18 కోట్లను తీసుకున్నారట. దీంతో రెండో పార్ట్‌కు ఆయన రూ.75కోట్ల మేర తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక రష్మికకు కూడా రెమ్యునరేషన్ పెరిగిందని సమాచారం.