పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో బన్నీ ఫ్యాన్ బేస్ రెట్టింపు కావడమే గాక ఇండియా లెవెల్ క్రేజ్ దక్కింది. సుకుమార్ రూపొందించిన ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ సృష్టించిన సునామీకి.. రాబట్టిన కలెక్షన్స్ ఎన్నో రికార్డులను తిరగరాశాయి.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, బన్నీతో మరో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో బాగా వినిపించిన వార్త.. మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత, త్రివిక్రమ్ బన్నీతోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అలవైకుంఠపురం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.
అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా 2023 సమ్మర్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉందని బాగా టాక్ నడిచింది. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని, హిందీ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఈ సినిమాలో ఉంటాడని.. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అని తెలుస్తోంది.
గతంలోనే బన్నీకి త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. బన్నీ – త్రివిక్రమ్ – కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. పైగా గతంలో అల్లు అర్జున్ తో జులాయి ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలు తీశాడు త్రివిక్రమ్
[caption id="attachment_1411982" align="alignnone" width="1600"] ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా విషయానికి వస్తే.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా హిట్ అయింది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులు నమోదు చేసింది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.